ప్రజల దృష్టి మళ్లించడానికే నోటీసుల డ్రామా : కేటీఆర్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-23 13:41:58  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

ప్రజల దృష్టి మళ్లించడానికే నోటీసుల డ్రామా : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో మీడియాకు లీకులు ఇవ్వడం, ప్రత్యర్థులపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను సన్మానించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... నదీ జలాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అవగాహన శూన్యమని, సాగునీటి మంత్రులది అంతులేని అజ్ఞానమని వ్యాఖ్యానించారు.

దమ్ముంటే ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సవాల్‌ విసిరారు. రెండేళ్లుగా రోజుకో కేసు అంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారని, కెమెరాల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం సీఎంకి లేదని అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన కేటీఆర్.. ప్రజల దృష్టి మళ్లించడానికే నోటీసుల డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలను అమలు చేయలేక రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

READ MORE ....

3 నెలలకోసారి వారి పనితీరుపై సమీక్షిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Next Story