3 నెలలకోసారి వారి పనితీరుపై సమీక్షిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-12-23 13:40:24  IST  )

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అన్ని విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

3 నెలలకోసారి వారి పనితీరుపై సమీక్షిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అన్ని విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శులకు కీలక సూచనలు చేశారు. గతంలో ఎనర్జీ, విద్య, ఇరిగేషన్‌, హెల్త్‌ వంటి ముఖ్య రంగాలకు స్పష్టమైన పాలసీలు లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రధాన విభాగాలకు అవసరమైన విధి విధానాలను రూపొందించినట్లు తెలిపారు. అధికారులు పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతి నెలా కార్యదర్శుల పనితీరును చీఫ్‌ సెక్రటరీ సమీక్షిస్తారని తెలిపారు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి తానే స్వయంగా అన్ని శాఖల కార్యదర్శుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

READ MORE ....

ప్రజల దృష్టి మళ్లించడానికే నోటీసుల డ్రామా : కేటీఆర్

Next Story