టీవీవీపీ కమిషనర్‌గా శ్రీనివాస్ ప్రసాద్?

by Naga Rani Yarlagadda |

టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త కమిషనర్ గా శ్రీనివాస్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.

టీవీవీపీ కమిషనర్‌గా శ్రీనివాస్ ప్రసాద్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ అజయ్ కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త కమిషనర్ గా నిజామాబాద్ డీసీహెచ్ఎస్ గా పనిచేస్తున్న డా. పి శ్రీనివాస్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముగ్గురు సభ్యులతో సీనియారిటీ లిస్ట్ తయారు చేయగా... సీనియారిటీలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారని తెలుస్తోంది. 1994లో సర్వీసులో చేరిన శ్రీనివాస్ ప్రసాద్.. 32 ఏళ్ల సర్వీసులో 25 ఏళ్లు మెడికల్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలుమార్లు ఉత్తమ వైద్యునిగా ఎంపికయ్యారు. మరోవైపు సీనియారిటీ లిస్టులో ఉన్న మిగతా ఇద్దరు వైద్యులు ఏడాది లోపే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ప్రసాద్ నియామకం లాంఛనమేనని వైద్య వర్గాలు తెలిపాయి.

Next Story