విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన డా.నమ్రత

by Yella Dhawani Reddy |

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు

విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన డా.నమ్రత
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Srishti Test Tube Baby Center) కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా తదితర కేసుల్లో ప్రధాన నిందితురాలైన డా.నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఆమెకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్ష నిర్వహించారు. అనంతరం నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయానికి తరలించారు. అయితే, ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడిన నమ్రత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఓ ఆర్మీ అధికారి తప్పుడు ఆరోపణల వల్లే తనపై కేసు పెట్టారని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.

సంతాన లేమితో బాధపడుతూ పిల్లల్ని కనాలనే కోరికతో ఐవీఎఫ్ కోసం తన వద్దకు వచ్చే దంపతులను డాక్టర్ నమ్రత సరోగసి వైపు మళ్లించేది. అనంతరం సరోగసి చేయకుండానే చేసినట్లుగా నమ్మించి వారి వద్ద నుంచి రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు దోచుకునేది. చాలా కేసుల్లో సరోగసీ చేయకుండానే పేద, మధ్య తరగతి దంపతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని వారికి ఎంతో కొంత చెల్లించి వాళ్ల పిల్లలను సంతానం లేని దంపతులకు సరోగసీ పేరుతో అంటగట్టినట్లు సమాచారం. ఇలా రూ.కోట్లు సంపాదించింది. ఈ ప్రక్రియలో డాక్టర్ నమ్రతకు గాంధీ దవాఖాన అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదానందం సహకరించినట్లు సమాచారం.

Next Story