భానుడి భగభగలు.. జూనియర్ కాలేజీల ఓపెనింగ్‌పై సందిగ్ధం..?

by Ramesh Naini |

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా ఉన్నందున, జూనియర్ కాలేజీల రీఓపెనింగ్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.

భానుడి భగభగలు.. జూనియర్ కాలేజీల ఓపెనింగ్‌పై సందిగ్ధం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా ఉన్నందున, జూనియర్ కాలేజీల రీ ఓపెనింగ్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుతమున్న తీవ్రమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ తేదీని జూన్ 8వ తేదీకి మార్చాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు, అధ్యాపకుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. దీంతో రేపు జూనియర్ కాలేజీల ఓపెనింగ్‌పై సందిగ్ధం ఏర్పడింది.

Next Story