దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 25 వరకు పెంపు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-19 15:49:34  IST  )

డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్ ) మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 13 నుంచి ఈ నెల 25 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఉన్నత విద్యా

దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 25 వరకు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్ ) మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 13 నుంచి ఈ నెల 25 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కళాశాల విద్య కమిషనర్, ఎ. దేవసేనలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తెలంగాణ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ కాలేజీల టీచర్స్ అసోసియేషన్ నుండి వచ్చిన అనేక అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కల్పించడానికి ఈ పొడిగింపు సహాయపడుతుందన్నారు. గడువు పొడిగింపుతో పాటు, రెండో విడత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు కూడా జూన్ 25 వరకు పొడిగించారు. తద్వారా సీట్లు ఇంకా ఖరారు చేసుకోని విద్యార్థులకు వెసులుబాటు కలుగుతుందన్నారు.

దోస్త్-2025 మూడో విడత సవరించిన షెడ్యూల్ :

మూడో విడత రిజిస్ట్రేషన్ : జూన్ 13 నుండి 25 వరకు పోడిగింపు

మూడో విడత వెబ్ఆప్షన్లు: జూన్ 13 నుండి 25 వరకు

మూడో విడత సీట్ల కేటాయింపు: జూన్ 28 న

కాలేజీల్లో రిపోర్టింగ్ (మొదటి, రెండో విడతల్లో సీట్లు ఖరారు చేసుకున్న విద్యార్థులు): జూన్ 26 నుండి 30 వరకు

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 28 నుండి 30 వరకు

మూడో విడతలో సీట్లు ఖరారు చేసుకున్న విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టింగ్: జూన్ 28 నుండి జూలై 1 వరకు

మొదటి సెమిస్టర్ తరగతుల ప్రారంభం: జూన్ 30, 2025

సంబంధిత కళాశాలల్లో విద్యార్థుల ఓరియంటేషన్: జూలై 1 నుండి జూలై 4 వరకు

Next Story