- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dost Notification: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (Degree Online Services Telangana) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, JNTUH, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ (BA), బీకాం (B.com), బీఎస్సీ (B.Sc.), బీబీఏ (BBA), తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
మొదటి ఫేజ్‌లో భాగంగా మే 3 నుంచి 21 వరకు మొదటి ఫేజ్ (First Phase) దరఖాస్తుల స్వీకరించనున్నారు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న సీట్లను కేటాయించనున్నారు. ఇక రెండో ఫేజ్ (Second Phase)లో మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. అదేవిధంగా మూడో ఫేజ్ (Third Phase)లో జూన్ 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరించి, జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జూన్ 23న సీట్ల కేటాయించిన తరువాత జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులు ‘దోస్త్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి కళాశాల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.






