- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీవోపీటీ కీలక నిర్ణయం.. CS రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు విషయంలో కేంద్ర హోం శాఖ పరిధిలోని DoPT కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగింపుపై ఉత్కంఠకు తెరపడింది. ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (DoPT) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు రామకృష్ణా రావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.
కాగా, వాస్తవానికి గతేడాది ఆగస్టు 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సర్వీసును పొడిగించాలని డీవోపీటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో 7 నెలలు ఆయన సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన రామకృష్ణా రావు సక్సెస్ అయ్యారు. యంత్రాగాన్ని గాడిలో పెట్టడం, తోటి సీనియర్ఐఏఎస్లతో కో-ఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయడం, గత ప్రభుత్వ రుణాలను షెడ్యూల్ చేయించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, మార్చి 31తో పదవీ కాలానికి సంబంధించి గడువు ముగుస్తుండటంతో మరోసారి ఎక్స్‌టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాయగా సానుకూలంగా స్పందించింది. దీంతో మరో 3 నెలల పాటు రామకృష్ణా రావు సీఎస్ పదవిలో ఉండనున్నారు.






