- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవగాహన లేకుండా మాట్లాడకండి.. ప్రతిపక్షాల విమర్శలకు శ్రీధర్ బాబు కౌంటర్
పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంత పచ్చగానే కనిపించినట్లుగా ప్రతిపక్షాల విమర్శలు ఉన్నాయని శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రామగుండం, పాల్వంచ, మక్తల్‌లలో మూడు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను (Thermal Power Plants) నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఖండించారు. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైదరాబాద్‍లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీధర్ బాబు.. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ స్థానంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు కోరామన్నారు. హిట్ హెడ్ వద్దనే థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అని జెన్ కో స్థలంలో తక్కువ ధరకు ఇచ్చే సంస్థకే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. దీనిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంత పచ్చగానే కనిపించినట్లుగా ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నాయన్నారు.






