న్యూయర్ గ్రీటింగ్ , ఆఫర్ లింక్స్ పై క్లిక్ చేస్తున్నారా? జాగ్ర‌త్త‌

by Ajay Maddhiboyina |

నూతన సంవత్సర శుభాకాంక్షలతో గిఫ్ట్‌లు, భారీ ఆఫర్ల పేరుతో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు.

న్యూయర్ గ్రీటింగ్ , ఆఫర్ లింక్స్ పై క్లిక్ చేస్తున్నారా? జాగ్ర‌త్త‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సర శుభాకాంక్షలతో గిఫ్ట్‌లు, భారీ ఆఫర్ల పేరుతో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. వాట్సాప్‌లో వచ్చే నకిలీ గ్రీటింగ్స్, ఆఫర్ లింకులు ఎపికే ఫైల్స్ పట్ల రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తూ సోమవారం అడ్వైజరీ జారీ చేశారు. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఇయర్-ఎండ్ ఆఫర్లు, ఉచిత గిఫ్ట్‌లు, ట్రావెల్ డిస్కౌంట్లు, ఈవెంట్ టిక్కెట్ల పేరుతో మోసపూరిత లింకులను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలిపారు. ఈ లింకులను క్లిక్ చేయగానే ఫోన్‌లో తెలియకుండానే ఒక ప్రమాదకరమైన ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ అవుతుందని డేటా చోరి జరుగుతుందని పేర్కోన్నారు.

మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చే యాప్‌లను, ఎపికే ఫైల్స్ ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయవద్దని తెలిపారు. కేవలం అఫీషియల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ మాత్రమే వాడండని సూచించారు. ఓటీపీలు, పిన్ నంబర్లు, సీవీవీ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. వాట్సాప్‌లో 'టూ-స్టెప్ వెరిఫికేషన్' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ పొరపాటున ఇటువంటి లింకులను క్లిక్ చేస్తే, వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి, అనుమానాస్పద యాప్‌లను డిలీట్ చేయాలని తెలిపారు. వెంటనే బ్యాంకుకు సమాచారం అందించి ఖాతాలను సురక్షితం చేసుకోవాలన్నారు. సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story