ప్రజలను తప్పుదోవ పట్టించకండి కేటీఆర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

అబద్దపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకండి కేటీఆర్ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించకండి కేటీఆర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అబద్దపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకండి కేటీఆర్ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో (Assembly sessions) భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఫ్యూచర్ సిటీ (Future City) అనేది యూ-టర్న్ కాదని, హైదరాబాద్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి రైట్ టర్న్! అని చెప్పారు. అన్ని తెలిసిన నాయకుడు అయ్యుండి తప్పుదోవ పట్టంచే సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంటే చూడడానికి నిరుత్సాహంగా ఉంది కేటీఆర్ అని అన్నారు. ఫోర్త్ సిటీ (Fourth City) అని కూడా పిలువబడే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని శ్రీధర్ బాబు తెలిపారు.

ఫ్యూచర్ సిటీ లో ఉంటే ముఖ్య అంశాలు

  • గ్రీన్ ఫార్మా సిటీ: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు ప్రత్యేక కేంద్రం
  • AI సిటీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీ కోసం ప్రత్యేక ప్రాంతం
  • క్లీన్ ఎనర్జీ మరియు కార్బన్ న్యూట్రాలిటీపై దృష్టి సారించి స్థిరమైన అభివృద్ధి.

హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తును నిర్మించేందుకు కలిసి పని చేద్దామని, తప్పుదోవ పట్టించే సమాచారంతో ప్రజల మనస్సులను నింపవద్దు! అని కేటీఆర్ ను మంత్రి కోరారు.

Next Story