ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దు.. పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ సీరియస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-01 07:56:11  IST  )

సిగాచి ఫార్మా కంపెనీ (Sigachi Pharma Company)లో రియాక్టర్ పేలిన పాశమైలారం (Pashamilaram) ఘటన స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిశీలించారు.

ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దు.. పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: సిగాచి ఫార్మా కంపెనీ (Sigachi Pharma Company)లో రియాక్టర్ పేలిన పాశమైలారం (Pashamilaram) ఘటన స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న అధికారులు, కలెక్టర్‌ను ప్రమాదం ఎలా జరిగిందని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించిన మృతదేహాలను ఏమాత్రం అలస్యం చేయకుండా వెంటనే బంధువులకు అప్పగించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిశ్రమ శాఖ అధికారులతో మాట్లాడారు.

ప్రమాదం జరిగిన పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా, బాయిలర్లు తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా అని ప్రశ్నించారు. అదేవిధంగా బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా అని అడిగారు. సిగాచి పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని క్వశ్చన్లు వేశారు. అయితే, అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో.. ఊహాజనిత సమాధానాలు చొప్పొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రమాద ఘటనపై నిపుణులతో చర్చించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. కొత్త వారితో కమిటీ వేసి తక్షణమే రిపోర్టు ప్రభుత్వానికి అందజేయాలని ప్రెస్‌మీట్‌లోనే ఆదేశాలు చేశారు. చనిపోయిన కార్మికులకు ఏమైనా ఇన్సురెన్స్ ఉందా అని ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇతర పరిశ్రమల్లోనూ తనిఖీలను కూడా ముమ్మరం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున తక్షణ సాయం ప్రకటన

ప్రమాదం జరిగి 24 గంటలకు గడస్తున్నా సిగాచి ఫార్మా కంపెనీ యాజమాన్యం ఘటనా స్థలానికి ఎందుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితులకు ఏం భోరోసా ఇచ్చారని ఫైర్ అయ్యారు. యాజమాన్య నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎక్స్‌గ్రేషియా విషయంలో మానవతా దృక్ఫథంతో చూడాలని యాజమాన్యానికి సూచించారు. మృతులకు తక్షణ సాయం కింద రూ.1 లక్ష, గాయపడి చికిత్ పొందుతున్న వారికి రూ.50 వేల సాయాన్ని ప్రకటించారు. ఇది నష్ట పరిహారం కాదని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆ ఖర్చును భరించేందుకు కూాడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

Next Story