- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Irrigation Department: అన్యాయమైపోయాం.. ఇక ఎక్స్ టెన్షన్స్ వద్దు.. సర్కార్ కు ఇంజనీర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
రిటైర్ అయిన ఉన్నతాధికారులకు ఎక్స్ టెన్షన్లు ఇవ్వొద్దని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నీటిపారుదల శాఖ (Irrigation Department) లో రిటైర్ అయిన ఉన్నతాధికారులకు ఎక్స్ టెన్షన్లు ఇవ్వొద్దని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (Telangana Engineers Association) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియట్ లో ఇరిగేషన్ సెక్రటరీకి సెంట్రల్ అసోసియేషన్ తరపున వినతి పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం అధికారులు రిటైర్ అయిన వారి సర్వీస్ పొడిగించడం వల్ల అర్హత కలిగిన అనేక మంది జూనియర్లు తమ ప్రమోషన్ పొందే అవకాశాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఎంతో మంది అర్హులైన అధికారులకు అన్యాయం జరిగిందని అందువల్ల ఎవరికీ ఎక్స్ టెన్షన్లు ఇవ్వొద్దని కోరారు. ఈ విషయంలో తాము అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక వేళ ఎవరైన పదవీ విరమణ పొందిన అధికారుల సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తే వారిని కేడర్ పోస్టుల్లో కాకుండా సలహాదారుగానో, ఓఎస్డీగానో లేదంటే కాంట్రాక్ట్ పద్దతిలో నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.






