- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు.. మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్
చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahash Kumar Goud) సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం గాంధీ భవన్ లో జహీరాబాద్(Zaheerabad), చేవెళ్ల (Chevella) పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), ఏఐసిసీ కార్యదర్శులు విష్ణునాధ్, విశ్వనాథన్, మంత్రులు దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతా రెడ్డి, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై వెనకబడి పోతున్నానమి నేతలను అప్రమత్తం చేశారు. ఏడాదిన్నర పాలనలో దేశ చరిత్రలో నిలిచిపోయే కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సన్న బియ్యం పంపిణీనిని మన ప్రభుత్వం తీసుకువచ్చిందని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలన్నారు.






