- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరదలపై గందరగోళం క్రియేట్ చేయకండి : తెలంగాణ పోలీసుల రిక్వెస్ట్
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిద్ధిపేట, ఖమ్మం జిల్లాల్లో వాగులు, నదులు పొంగిపొరలాగా.. పలుచోట్ల చెరువులు కట్టలు తెగి ఊళ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే వరదల్లో చిక్కుకున్న వారిని SDRF, NDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు చేసి రక్షించాయి. అయితే వరదలపై పలువురు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పాత వీడియోలు షేర్ చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని.. దయచేసి అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ, గందరగోళం సృష్టించవద్దని తెలంగాణ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
వరదల సమాచారాన్ని షేర్ చేసేముందు తొలుత నిర్ధారించుకోవాలని తెలిపారు. అధికారిక ఖాతాల్లో లేదా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని కోరారు. వరదలకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ అయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి వాటిని నమ్మి భయపడవద్దని ప్రజలకు సూచించారు.






