Dog attack: కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క

by Ramesh Naini |

రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిపై కొన్ని వీధి కుక్కలు విరుచుకపడుతున్నాయి.

Dog attack: కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిపై కొన్ని వీధి కుక్కలు విరుచుకపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌- కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (Koti Women's College)లో విద్యార్థినులపై ఓ కుక్క దాడి (Dog attack) చేసింది. ఈ ఘటనలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, హైదరాబాద్‌లో ఏటా దాదాపు 30 వేల మంది కుక్కల కాటుకు గురవుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. రోజుకు 70 నుంచి 90 కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయని పేర్కొంటున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 4 నుంచి 6 లక్షల కుక్కలు ఉన్నాయి.

Next Story