ప్రధానికి సింధూరం విలువ తెలుసా.. రాజ్యసభలో నిప్పులు చెరిగిన రేణుకా చౌదరి

by Kema Shiva Kumar |

పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి.

ప్రధానికి సింధూరం విలువ తెలుసా.. రాజ్యసభలో నిప్పులు చెరిగిన రేణుకా చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం రాజ్యసభ (Rajya Sabha)లో ఆపరేషన్ సిందూర్‌పై అధికార, విపక్ష పార్టీ మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ (N Jaishankar) ఆపరేషన్ సిందూర్‌పై చర్చను మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించారు. అనంతరం హౌస్ లీడర్ జేపీ నడ్డా (JP Nadda) పాక్‌పై భారత సైన్యం అటాక్, పహల్గాం టెర్రర్ అటాక్, దాడికి పాల్పడిన ఉగ్రవాదులు హతమైన విషయాలపై ప్రసగించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభ్యురాలు ఆపరేషన్ సిందూర్‌పై రేణుకా చౌదరి (Renuka Chowdary) మాట్లాడుతూ.. ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎనిమిది దేశాల్లో చక్కర్లు కొట్టొచ్చారు.. కానీ, పహల్గామ్ ఉగ్రదాడిలో బాధితులను కలిసేందుకు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి సమయం లేదా అని ఫైర్ అయ్యారు. ఇంతటి విషాదం జరిగి మృతుల కుటుంబాలు షాక్‌లో ఉంటే వారిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. అసలు ప్రధానికి ఆడబిడ్డ నుదుటిపై ఉన్న సింధూరం విలువ తెలుసా అని ప్రశ్నించారు. పహల్గాం టెర్రర్ అటాక్‌పై ఎవరికీ జవాబుదారీతనం లేకుండా పోయిందని రేణుకా చౌదరి రాజ్యసభలో అధికార పక్షంపై మండిపడ్డారు.

Next Story