మేం కవితను జైలుకు పంపాం.. కేటీఆర్‌ను లోపల వేసే ధైర్యం ఉందా? కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ నేత, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మేం కవితను జైలుకు పంపాం.. కేటీఆర్‌ను లోపల వేసే ధైర్యం ఉందా? కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ నేత, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్‌లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, వాటిపై లోతైన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కారు రేసులో కేటీఆర్ కచ్చితంగా జైలుకు పోతాడనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉందని గతంలో ఆరోపించారని, కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు.. మరి ఈ రెండేళ్లు ఎందుకు లోపల వేయలేదని ప్రశ్నించారు. మేం కవితను జైలుకు పంపాం.. కేటీఆర్ ను లోపల వేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా..? అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. గత కొన్నేళ్లుగా లక్ష కోట్లు దోచుకున్నారని మాట్లాడారు.. ఎందుకు జైలుకు పంపడంలేదని కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీశారు. మునుగోడులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించారని గుర్తుకు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు పంపింది కేసీఆర్ అని ఎంపీ ఆరోపించారు.

Next Story