సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా? మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

సినిమా థియేటర్ ఓపెనింగ్ వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే దమ్ముందా? అని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు.

సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా? మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సినిమా థియేటర్ ఓపెనింగ్ వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే దమ్ముందా? అని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాడు ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు.. ఎందుకు ముఖం చూపడం లేదని అన్నారు. వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య సినిమా థియేటర్ వెళ్ళే సమయం ఉన్న సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా? అని నిలదీశారు. నువ్వు ప్రారంభించే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ లైబ్రరీ ఉంది.. అక్కడి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

లైబ్రరీకి వెళ్లకుండా తోక ముడుచుకొని పారిపోతే నిరుద్యోగులను మోసం చేసినట్లే అని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వనే లేదన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యం అని మంత్రి శ్రీధర్ బాబు ఎలా అంటారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు నమ్మించారు, ఇప్పుడు నయవంచన చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు.

Next Story