- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dead Doctor Saves Five Lives : మరణంలోనూ ఐదుగురికి ప్రాణదాతగా డాక్టరమ్మ!
జీవించిన సమయంలో ఓ డాక్టర్(Doctor)గా ప్రజలకు వైద్య చికిత్సలు అందించడం వృత్తిగా పనిచేసి..ప్రమాదంలో తాను చనిపోయిన మరో 5గురికి ప్రాణదాత(Doctor saves five lives even in death)గా నిలిచిన ఘటన సర్వత్రా ప్రశంసలందుకుంటుంది

దిశ, వెబ్ డెస్క్ : జీవించిన సమయంలో ఓ డాక్టర్(Doctor)గా ప్రజలకు వైద్య చికిత్సలు అందించడం వృత్తిగా పనిచేసి..ప్రమాదంలో తాను చనిపోయిన మరో 5గురికి ప్రాణదాత(Doctor saves five lives even in death)గా నిలిచిన ఘటన సర్వత్రా ప్రశంసలందుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోను టీజీ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీ.సీ.సజ్జనార్(IPS officer V.C. Sajjanar)ఎక్స్ లో పోస్టు చేయగా..అది వైరల్ గా మారింది. నార్సింగి పీఎస్ పరిధిలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యశ్వంత్ అనే డాక్టర్ మృతి చెందగా.. డాక్టర్ నంగి భూమిక(Dr. Nangi Bhumika) తీవ్రంగా గాయపడింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూమిక బ్రెయిన్ డెడ్ (Brain Dead)కు గురైంది. భూమిక ఇక లేదని తెలిసి ఆమె కుటుంబంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. అయితే జీవన్ దాన్ (Jeevandants) చొరవతో భూమిక కుటుంబ సభ్యుల(Bhumika's family) అంగీకారంతో.. ఆమె గుండె, లివర్, లంగ్స్, కిడ్నీలను దానం(Organ Donation) చేశారు. దీంతో చనిపోతూ కూడా ఆ వైద్యురాలు భూమిక ఐదుగురికి ప్రాణం పోసినట్లయ్యింది. ఆమె అవయవాలు దానం చేయడంతో ఐదుగురి ప్రాణాలు ఊపిరి పోసుకున్నాయి. పుట్టెడు దుఃఖంలోను ఔదార్యం చూపిస్తూ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన భూమిక కుటుంబ సభ్యుల పట్ల సర్వాత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.






