లా సెట్‌లో సత్తా చాటిన డాక్టర్

by Ajay Maddhiboyina |

వైద్య విద్యలో పీజీ పూర్తి చేసిన ఓ డాక్టర్ న్యాయ విద్యలోనూ పట్టు సాధించాలనుకున్నాడు. దీంతో తెలంగాణ లాసెట్ 2025 కి అటెండ్ అయి మంచి ర్యాంకు సాధించాడు.

లా సెట్‌లో సత్తా చాటిన డాక్టర్
X

దిశ తెలంగాణ బ్యూరో: వైద్య విద్యలో పీజీ పూర్తి చేసిన ఓ డాక్టర్ న్యాయ విద్యలోనూ పట్టు సాధించాలనుకున్నాడు. దీంతో తెలంగాణ లాసెట్ 2025 కి అటెండ్ అయి మంచి ర్యాంకు సాధించాడు. ఉస్మానియాలో ఎంబిబిఎస్, ఎండీ (పల్మనాలజీ) పూర్తి చేసిన డా. ఎం. రాజీవ్ సమాజానికి, ప్రజారోగ్య రంగానికి న్యాయపరమైన అవగాహనతో ...వైద్య రంగంలో సేవ చేయడం తాను న్యాయ విద్యను అభ్యసించాలనే నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య కారణం అని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టి.ఎస్.ఎం.సి) లో సభ్యుడిగా కూడా సేవలు అందిస్తున్నారు. “ఆరోగ్యానికి న్యాయం – న్యాయంగా ఆరోగ్యం” అన్న సంకల్పంతో వైట్ కోట్ (వైద్యం) బ్లాక్ కోట్ (న్యాయం) రెండింటి మేళవింపుతో.. ప్రజల హక్కుల కోసం, వైద్యుల రక్షణ కోసం, భవిష్యత్తులో పని చేస్తానని డా.రాజీవ్ అంటున్నారు.

Next Story