- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంజారాహిల్స్‌లో దారుణం.. పెళ్లిపేరుతో వైద్యురాలిపై కోరిక తీర్చుకున్న డాక్టర్
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వైద్యురాలిపై కోరిక తీర్చుకుని మొహం చాటేశాడో డాక్టర్. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా, ఎంతమందిని కఠినంగా శిక్షించినా కామాంధుల ఆలోచనల్లో మార్పు రావట్లేదు. తాజాగా ఓ డాక్టర్.. వైద్యురాలిని పెళ్లిపేరుతో నమ్మించి మోసం చేసిన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వైద్యురాలిపై కోరిక తీర్చుకుని మొహం చాటేశాడో డాక్టర్. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న మహిళకు.. మహబూబాబాద్ గవర్నమెంట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న స్వామితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య పరిచయం పెళ్లి ప్రస్తావనకు దారితీయగా.. ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్వామి ఆమెను బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. కొద్దిరోజులకు ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా నిరాకరించాడు.
దాంతో స్వామి తనను పెళ్లిపేరుతో శారీరకంగా వాడుకుని, మోసం చేశాడని గ్రహించిన మహిళా డాక్టర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వామిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.






