- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సభ్యుల విషెస్.. ఎందుకో తెలుసా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రివర్గ సభ్యులు భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రివర్గ సభ్యులు భేటీ అయ్యారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్‌లో ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ' ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వర్గసహచరులు కలిశారు. ఈ మేరకు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణా రావు, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు.






