- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిషన్ రెడ్డిపై మాట్లాడే స్థాయి నీకుందా అంజన్ కుమార్..! బీజేపీ తెలంగాణ సంచలన ట్వీట్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మాట్లాడే స్థాయి నీకుందా అంజన్ కుమార్.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికే ఈ వ్యాఖ్యలు చేశావని బీజేపీ తెలంగాణ (BJP Telangana) ట్వీట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మాట్లాడే స్థాయి నీకుందా అంజన్ కుమార్.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికే ఈ వ్యాఖ్యలు చేశావని బీజేపీ తెలంగాణ (BJP Telangana) ట్వీట్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్లను ఈడీ చార్జిషీట్ లో చేర్చడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ ఆఫీస్ (Hyderabad ED Office) ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Former MP Anjan Kumar Yadav) మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy)పై దుర్భాషలాడారు.
దీంతో అంజన్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు (BJP Leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా.. అంజన్ కుమార్ ఇన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఉన్నా పదవి దక్కడం లేదనే కోపంతో.. సొంత పార్టీ నేతలపైనే నోరు పారేసుకున్నాడని, అయినా ఎవ్వరూ ఆయన వైపు గానీ, ఆయన ముఖం గానీ చూడలేదని వ్యాఖ్యానించింది. బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని తిట్టి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదామనుకునే నీ ఆలోచనే.. నీ వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతుందని ఘాటుగా విమర్శించింది.
అలాగే కాంగ్రెస్ అసమర్ధ పాలనలో రాష్ట్రంలో కుంటుపడ్డ అభివృద్ధిపై మాట్లాడే సోయి లేదు.. ప్రజా సమస్యలపై నోరు విప్పే ధైర్యం లేదు.. నిరుద్యోగితపై సమాధానం చెప్పే మొఖం లేదు.. రైతుల, నేతన్నల చావులపై నోరు లేవదు.. ఆడబిడ్డల భద్రతపై మాటలు రావు అని హాట్ కామెంట్స్ చేసింది. అంతేగాక తెలంగాణ ప్రగతికై నిధులు తీసుకొస్తున్న కిషన్ రెడ్డిపై మాట్లాడే స్థాయి ఉందా అసలు నీకు? అంటూ.. నీ స్థాయి ఏంటో నీక్కూడా తెలుసు అందుకే.. ఇలా నోటికి పనిచెప్పావ్ అని బీజేపీ తెలంగాణ రాసుకొచ్చింది.






