- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ నల్లమల సాగర్ కు అనుమతులు ఇవ్వొద్దు : కేంద్రానికి ఉత్తమ్ లేఖ
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కేంద్రానికి లేఖ రాసారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కేంద్రానికి లేఖ రాసారు. ఏపీ నిర్మించ తలపెట్టిన నల్లమల సాగర్ కు అనుమతులు ఇవ్వరాదని లేఖలో కోరారు. అంతేకాదు కర్ణాటక ఆల్మట్టి డ్యాం భూసేకరణకు అనుమతులు ఇవ్వవద్దని, ఇవి బచావత్ ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని గుర్తుచేస్తూ, అదే స్థానంలో ఏపీ నల్లమల సాగర్‌కు డీపీఆర్ తయారీ టెండర్లు పిలవడాన్ని తెలంగాణ అభ్యంతరం తెలుపుతోందని అన్నారు.
అలాగే 2026–2031 మధ్య తెలంగాణలోని ప్రాణహిత–చేవెళ్ల, నారాయణ్‌పేట్–కొడంగల్, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, ముక్తేశ్వర్, మోడికుంట వాగు, చనక–కొరాట తదితర ప్రాజెక్టులకు పీఎంకేఎస్‌వై–ఏఐబీపీ కింద నిధులు కేటాయించాలని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్–2 విచారణ త్వరగా పూర్తి చేసి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే సమర్పించిన పాలమూరు–రంగారెడ్డి తొలి దశ, సమ్మక్క–సారక్క ప్రాజెక్టుల డీపీఆర్‌లకు తక్షణమే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.






