Sajjanar : డీఎం మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకం : సజ్జనార్

by Y. Venkata Narasimha Reddy |

విధి నిర్వహణలో ఉన్న జగిత్యాల డిపో మేనేజర్(Jagityala Depot Manager) మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకమని సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ (V.C. Sajjanar)అభినందించారు.

Sajjanar : డీఎం మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకం : సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్ : విధి నిర్వహణలో ఉన్న జగిత్యాల డిపో మేనేజర్(Jagityala Depot Manager) మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకమని సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ (V.C. Sajjanar)అభినందించారు. సంక్రాంతి ఆపరేషన్స్ లో భాగంగా బిజీగా విధులు నిర్వర్తిస్తూనే.. జగిత్యాల బస్ స్టేషన్ లో గుండెపోటు వచ్చిన ప్రయాణికురాలి(Passenger who had a Heart Attack)కి సీపీఆర్(CPR) చేసి డీఎం ప్రాణాలు కాపాడటాన్ని ఆయక ఎక్స్ వేదికగా ప్రశంసించారు.

మెరుగైన చికిత్స కోసం ప్రయాణికురాలిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారని..విధి నిర్వహణలో ఉన్న డీఎం మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. కర్తవ్య నిర్వాహణ చేస్తునే మానవత్వం చాటడంలో ఆర్టీసీ సిబ్బంది తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. బస్సుల్లో ప్రసవాలు, గుండెపోటు మరణాలు వంటి ఘటనలలో వారు సమయోచితంగా సహాయం ఆదర్శంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన ఉర్సు మమత గోదావరిఖని గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురును సంక్రాంతి సెలవులకు ఇంటికి తీసుకొస్తూ జగిత్యాల బస్టాండ్ కు చేరుకుంది.

మల్లాపూర్ బస్సు కోసం వెలుతున్న క్రమంలో ఆమె ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే అక్కడే ఉన్న డిపో మేనేజర్ సునీత ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాపాయం నుండి కాపాడారు. అనంతరం 108అంబులెన్స్ లో జగిత్యాల ఆసుపత్రికి పంపించారు.

Next Story