- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Effect: నర్సింగ్ కాలేజీలపై DME అధికారుల పంజా.. అంతా గప్ చుప్
నల్లగొండ జిల్లాలో నర్సింగ్ కాలేజీలపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) అధికారుల బృందం విచారణ చేస్తున్నట్టు సమాచారం.

దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లాలో నర్సింగ్ కాలేజీలపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) అధికారుల బృందం విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ‘దిశ’ పత్రికలో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు.. DME కార్యాలయంలో నర్సింగ్ కౌన్సిల్ ఫ్యాక్టరీతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ వెంటనే మంగళవారం రంగంలోకి దిగిన స్పెషల్ టీం నల్లగొండ జిల్లాలో ఉన్న కాలేజీలల్లో తనిఖీ చేపట్టినట్టు సమాచారం. కాలేజీ భవనాలు, అందిస్తున్న సౌకర్యాలు, విద్యార్థులు సంఖ్య, అర్హత కలిగిన అధ్యాపకుల వివరాలు, తదితర అంశాలపై విచారణ చేపట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా విద్యార్థులు లేకున్నా.. ఉన్నట్లు రికార్డులు చూపించి ప్రభుత్వం నుంచి అందుతున్న ఉపకార వేతనాలను నర్సింగ్ కాలేజీలు దోచేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిపై ప్రస్తుతం నల్లగొండ జిల్లా కేంద్రంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే విచారణ చేసేందుకు నల్లగొండకు వస్తున్న ప్రత్యేక బృందం చాలా రహస్యంగా వచ్చి కాలేజీలలో ఉన్న సౌకర్యాలపై ఎంక్వైయిరీ చేయాలని భావించింది. కానీ, కౌన్సిల్లో ఉన్న ఓ సీనియర్ అధికారి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఉన్న నర్సింగ్ కళాశాల యాజమాన్యానికి సమాచారం లీక్ చేసినట్టు తెలిసింది. మరోవైపు DME అధికారుల విచారణ సమాచారాన్ని అందుకున్న జర్నలిస్టులు కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా.. నర్సింగ్ కాలేజీల యజమాన్యాలు అడ్డుకున్నాయి. ఇక్కడ ఎలాంటి విచారణ జరగటం లేదని, మీరెవరు లోపలికి రావడానికి అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగాయి. అధికారుల విచారణ సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ పారదర్శకంగా జరుగుతుందా లేదా అనేది అనుమానాలకు తావిస్తోంది.






