వివరణ ఇవ్వండి.. జగిత్యాల డాక్టర్లకు డీఎంఈ ఆదేశం

by Dishafeatures2 |
వివరణ ఇవ్వండి.. జగిత్యాల డాక్టర్లకు డీఎంఈ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జగిత్యాల జనరల్ హాస్పిటల్ లో శనివారం మంత్రి హరీష్​ రావు అకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలో విధుల్లో లేని డాక్టర్లపై డీఎంఈ డాక్టర్ రమేష్​ రెడ్డి సీరియస్​ అయ్యారు. వెంటనే ఈ నెల 18 వరకు వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఓబీజీ ప్రోఫెసర్​ డాక్టర్ అరుణ శ్రీ, పిడియాట్రిక్​ ప్రోఫెసర్​, అనస్థీషియా స్టాఫ్​, ఆప్తమాలజీ డాక్టర్ ఎన్ సుజాతలు విధులకు హాజరుకాకపోవడంలో లిఖిత పూర్వకంగా క్లారిటీ ఇవ్వాలని డీఎంఈ కోరారు. అంతేగాక అన్ని జిల్లాల సూపరింటెండెంట్ లు, ప్రిన్సిపాళ్లు డాక్టర్లు, స్టాఫ్​అటెండెన్స్​ ను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు.


Next Story