తెలంగాణ రాకముందే.. ఇప్పుడు KCR ఆస్తులను ప్రకటించాలి: DK అరుణ డిమాండ్

by Disha Web Desk 19 |
తెలంగాణ రాకముందే.. ఇప్పుడు KCR ఆస్తులను ప్రకటించాలి: DK అరుణ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ క్షక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పెద్ద డైలాగ్ వారే నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలకు మరికొన్ని నెలల సమమయం ఉండగానే.. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య జరుగుతోన్న తాజా మాటల యుద్ధం రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడిని తలపిస్తుంది.

తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్, కవిత ఫ్రస్టేషన్‌లో ఉండి మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఎలాంటి తప్పు చేయనప్పుడు భయం ఎందుకని.. ధైర్యంగా విచారణ ఎదుర్కొవాలన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాకముందు.. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను ప్రకటించాలని అరుణ డిమాండ్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ కవితకు నోటీసులు ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు మొత్తం సమాజాన్నే అవమానిస్తున్నట్లు ప్రవరిస్తున్నారని ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఆపద వచ్చినప్పడల్లా తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడం బాగా అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని.. పచ్చ కామెర్లు ఉన్నావారికి లోకమంతా అలాగే కనిపిస్తుందని డీకే అరుణ ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed