బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు

by Aamani |
బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు
X

దిశ,షాద్ నగర్ : ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ సినీనటి నవనీత్ కౌర్ పై జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 188 సెక్షన్ క్రింద కేసు నమోదయింది.ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని డీకే అరుణ తరపున రోడ్ షో నిర్వహించిన నవనీత్ కౌర్ ప్రసంగంలో ఆక్షేపణలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ గుర్తించి,కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు కూడా ధృవీకరించారు.

Next Story

Most Viewed