బీజేపీ మెజార్టీ కోల్పోయింది.. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే : కాంగ్రెస్

by Dishanational6 |
బీజేపీ మెజార్టీ కోల్పోయింది.. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే : కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ మెజారిటీ కోల్పోయింది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ సీనియన్ లీడర్ జైరాం రమేశ్ హర్యానా బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనకు ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో హర్యానా ప్రభుత్వం స్పష్టంగా మెజారిటీని కోల్పోయిందని అన్నారు. లేదంటే బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది. గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నో పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసింది. ఢిల్లీలో బీజేపీ రోజులు పోయినట్లే.. హర్యానాలో కూడా బీజేపీకి కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు జైరాం రమేశ్. మరోవైపు హర్యానా సంక్షోభం వేళ.. కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలవనున్నారు.

మరోవైపు, హర్యానాలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మీడియాతో మట్లాడారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్నే గవర్నర్ కు లిఖిత పూర్వకంగా రాసిన లెటర్ లో ప్రస్తావించారు.

కాగా, 90 మంది ఎమ్మెల్యేలున్న హర్యానా అసెంబ్లీలో అధికార బీజేపీకి 39 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జన్ నాయక్ జనతాపార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. హర్యానా లోక్‌హిత్‌ పార్టీ, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దల్‌ పార్టీల నుంచి ఒక్కో ఎమ్మెల్యే గెలిచారు. ఏడుగురు ఇండిపెండెంట్‌ల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే7న ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు. దీంతో, హర్యానా సర్కార్ సంక్షోభంలో పడింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖట్టర్ స్థానంలో నయాబ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed