- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్‌పల్లి మాల్‌లో డీజే ప్లేయర్‌కు డ్రగ్స్ పాజిటివ్
by Ramesh Naini |
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ ప్రముఖ మాల్‌లో నిర్వహించిన న్యూయర్ వేడుకల్లో పాల్గొన్న డీజే ప్లేయర్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. న్యూయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు పబ్‌లు, మాల్స్, న్యూయర్ ఈవెంట్లలో విస్తృత స్థాయిలో సోదాలు, డ్రగ్స్ టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ ప్రముఖ మాల్‌లో నిర్వహించిన న్యూయర్ వేడుకల్లో పాల్గొన్న డీజే ప్లేయర్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో డీజే ప్లేయర్ మాదకద్రవ్యాలు వినియోగించినట్టు తేలింది. డీజే ప్లేయర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడు డ్రగ్స్ ఎక్కడ నుంచి కొనుగోలు చేశాడు, ఎవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశాలపై విచారణ చేపట్టారు.
Next Story






