తెలంగాణపై దిత్వా ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-30 07:35:19  IST  )

శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను భారత్ వైపు వస్తుండగా.. దీని ప్రభాతం దక్షిణ కోస్తా, తమిళనాడు రాష్ట్రాలతోపాటు తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణపై దిత్వా ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను భారత్ వైపు వస్తుండగా.. దీని ప్రభాతం దక్షిణ కోస్తా, తమిళనాడు రాష్ట్రాలతోపాటు తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి ఈ తుపాను పుదుచ్చేరికి 160, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే ఏపీలో దక్షిణ కోస్తాపై దిత్వా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉమ్మడి కర్నూల్, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు.

Next Story