దూసుకొస్తున్న దిత్వా.. ఏపీ, తెలంగాణపై ప్రభావం ఎలా ఉంటుందంటే?

by Ajay Maddhiboyina |

దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. తుఫాన్ సృష్టించిన బీభ‌త్సానికి అక్క‌డ 123 మంది మ‌ర‌ణించారు. వ‌ర‌ద‌ల్లో ఇల్లు కొట్టుకుపోయి వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. కాగా ఈ తుఫాన్ ఇప్పుడు ఏపీ వైపుకు సైతం దూసుకువ‌స్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

దూసుకొస్తున్న దిత్వా.. ఏపీ, తెలంగాణపై ప్రభావం ఎలా ఉంటుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. తుఫాన్ సృష్టించిన బీభ‌త్సానికి అక్క‌డ 123 మంది మ‌ర‌ణించారు. వ‌ర‌ద‌ల్లో ఇల్లు కొట్టుకుపోయి వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. కాగా ఈ తుఫాన్ ఇప్పుడు ఏపీ వైపుకు సైతం దూసుకువ‌స్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తుఫాన్ కార‌ణంగా ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్ వెల్ల‌డించారు.

మరోవైపు తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే వాతావరణశాాఖ హెచ్చరించింది. తిరుప‌తి, చిత్తూరు, అన్న‌మ‌య్య‌, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల్లో ఆక‌స్మిక వ‌రద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందని పేర్కొంది. మ‌త్స్య‌కారులు ఎవ‌రూ చేప‌ల వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చరించింది. ఇక తుఫాన్ ప్ర‌భావం తెలంగాణ‌పై స్వ‌ల్పంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ‌లో ఆది, సోమ‌వారాలు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు.

Next Story