ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు అడవుల్లో అలజడి.. ‘ఆపరేషన్ కగార్’ మళ్లీ మొదలు

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), తెలంగాణ సరిహద్దు(Telangana Border) అడవుల్లో మళ్లీ అలజడి మొదలైంది.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు అడవుల్లో అలజడి.. ‘ఆపరేషన్ కగార్’ మళ్లీ మొదలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), తెలంగాణ సరిహద్దు(Telangana Border) అడవుల్లో మళ్లీ అలజడి మొదలైంది. భద్రతా బలగాలు(Security Forces) కర్రెగుట్ట(Karregutta)లో ఆపరేషన్ కగార్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్‌ను బలగాలు వేగవంతం చేశాయి. భారత్ - పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఆపరేషన్ కగార్ నుంచి కొంతమంది బలగాలను కేంద్రం వెనక్కి రప్పించింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధానికి బ్రేక్ పడటంతో మళ్లీ బలగాలను కర్రెగుట్టకు పంపినట్లు తెలుస్తోంది. గత రాత్రి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు కర్రెగుట్టలో ప్రవేశించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరుపాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో తమ నుంచి ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తున్నామని ఇటీవల మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. కాగా, ఆపరేషన్ కగార్ ఆపాలని తెలంగాణలోని సీపీఐఎం, సీపీఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Next Story