TG: గ్యాస్‌ను పొదుపుగా వాడుకోండి.. రాష్ట్ర ప్రజలకు డిస్ట్రిబ్యూటర్ల అలర్ట్

by Gantepaka Srikanth |

గ్యాస్ కొరతపై తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

TG: గ్యాస్‌ను పొదుపుగా వాడుకోండి.. రాష్ట్ర ప్రజలకు డిస్ట్రిబ్యూటర్ల అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ కొరతపై తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడే గ్యాస్ కొరత వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కానీ ఇరాన్ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. మరోవైపు ఇప్పటికే గ్యాస్ ఇబ్బందులు పెరగకుండా కేంద్రం అప్రమత్తమైందని చెప్పారు. గృహ వినియోగదారులకు కొరత రాకుండా కేంద్రం ముందస్తు చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటికే వ్యాపార, హోటల్స్‌కు నిలిపివేస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. హాస్టళ్లు, ఆస్పత్రులు వంటి అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల మేరకు ఆయిల్ కంపెనీలకు గ్యాస్ కొనసాగనుందని వెల్లడించారు. అంతిమంగా గృహ వినియోగదారులు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచనలు చేశారు.

మరోవైపు పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. గ్యాస్ నిల్వలను పెంచాలని చమురు సంస్థలను ఆదేశించింది. అంతేకాకుండా ఎల్పీబీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అలాగే వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆస్పత్రులు మరియు విద్యా సంస్థలకు గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Next Story