- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ షురూ.. సర్కార్‌పై రూ.2,800 కోట్ల భారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం కోసం ప్రతి ఏటా అదనంగా రూ.2,858 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం కోసం ప్రతి ఏటా అదనంగా రూ.2,858 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కింద ప్రతి నెలా 3.10 కోట్ల మంది ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకం అమలుతో ఒక్కో ఫ్యామిలీకి ప్రతి నెలా రూ.1,200 అదనంగా లబ్ధి చేకూరుతుందని, ఒక్కో కుటుంబానికి ఏటా రూ.14,400 ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. సన్నబియ్యం పంపిణీపై పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు అన్ని జిల్లాల నుంచి తమకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని సర్కారు భావిస్తున్నది.
సన్నబియ్యం భారం రాష్ట్రానిదే
సన్నబియ్యం పథకం వల్ల సర్కారుపై పడే అదనపు భారం పూర్తిగా రాష్ట్రమే భరించనుంది. ఈ స్కీమ్ అమలు కోసం కేంద్రం అదనంగా ఎలాంటి ఆర్థిక సహాయం చేయట్లేదు. అయితే, ప్రతి ఏటా పేదలకు రేషన్ స్కీమ్ కోసం కేంద్రం ఇచ్చే రూ.5,489 కోట్లలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ రాష్ట్రంపై మాత్రం ప్రతి ఏడాది అదనపు భారం పడుతుందని ఆఫీసర్లు లెక్కలు తీశారు. ప్రతి సంవత్సరం రేషన్ బియ్యం పంపిణీ కోసం రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సన్నబియ్యం సరఫరాతో అదనంగా రూ.2,858కోట్ల భరించాల్సి ఉంటుంది. సన్నాల సరఫరాతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ డిస్కషన్ జరుగుతున్నదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
అక్రమ దందాకు చెక్
డొడ్డు బియ్యం ఇవ్వడంతో మెజార్టీ మంది ప్రజలు వాటిని తినకుండా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేవారు. వారంతా ఆ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు విక్రయించేవారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆ బియ్యం చివరికి సివిల్ సప్లయ్‌కు చేరి, మళ్లీ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రేషన్ డీలర్లకు చేరడం రొటీన్‌గా మారింది. సన్నబియ్యం సరఫరాతో మెజార్టీ మంది వాటిని తినేందుకు మొగ్గుచూపుతున్నారని, దీనితో అక్రమ రావాణాకు చెక్ పడుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
తెల్లరేషన్ కార్డులు - కార్డులు - లబ్ధిదారులు - కేంద్రం వాటా - రాష్ట్ర వాటా
ప్రస్తుత కార్డులు - 89,89836 - 2.81 కోట్లు - 5,489 కోట్లు - 5,175 కోట్లు
కొత్త కార్డులు - 99,89836 - 3.10 కోట్లు - 5,489 కోట్లు - 8,033 కోట్లు
అదనపు భారం - 2,858 కోట్లు






