- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాభవన్‌లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు సీతక్క, వాకిటి
తెలంగాణలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పమని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పమని మంత్రి సీతక్క అన్నారు. అందుకే అన్ని వ్యాపారుల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. సోమవారం ప్రజాభవన్‌లో సంచార చేపల విక్రయ వాహనాల (Fish vending vehicles) పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka), పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా సెర్ప్ ద్వారా గతంలో 31 వాహనాలను పంపిణీ చేసిన ప్రభుత్వం. మంచి ఫలితాలు రావడంతో, ఈ రోజు మరో 36 వాహనాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు పట్టుదలగా పనిచేస్తున్నామని అన్నారు. 20 కి పైగా వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
పెట్రోల్ బంకులు సోలార్ కంపెనీలు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సంచార చేపల విక్రయ వాహనాల ద్వారా ప్రతి రోజు రూ. 8 వేలు సంపాదిస్తున్నారని అన్నారు. లైవ్ ఫిష్ తోపాటు, చేపల ఫ్రై, పచ్చళ్ళు చేసి విక్రయిస్తున్నారని అన్నారు. నాణ్యమైన రుచికరమైన చేపల వంటకాలు విక్రయిస్తే మంచి డిమాండ్ ఉంటుందన్నారు. అమ్మ చేతి రుచిని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా అందిస్తున్నామని అన్నారు. అమ్మ చేతి వంటకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నిలుస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటే ఆర్థిక ధీమా ఉంటుందని, మహిళా సభ్యులకు రెండు లక్షల వరకు లోన్ బీమా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘం అనేది ఒక భరోసా.. ఆపద సమయంలో అండగా ఉంటుందన్నారు.






