- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. చెక్కుల పంపిణీ షురూ! మొట్టమొదటి బిల్లు ఆమెకే..

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో పేదల కల అయిన సొంతింటి ఆశయాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల (Indiramma House) పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. పథకం తొలి దశలో అత్యంత పేదలైన, నిజమైన అర్హులకే ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల (Cheques) చెక్కుల పంపిణీ షూరు చేశారు. మంగళవారం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. అందులో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసులు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లులో మొట్టమొదటి బిల్లును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి, మరికొందరు లక్ష రూపాయల చెక్కును అందుకున్నారు. కాగా, నోవాటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.