- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-2: ఈ నెల 18న గ్రూప్-2 అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్-2 ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా (Group-2) గ్రూప్-2 ఎంపికైన అభ్యర్థులకు (Appointment orders) నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 18న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగనుంది. మొత్తం 782 మంది గ్రూప్-2 అభ్యర్థులు ఈ సందర్భంగా నియామక పత్రాలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే, సర్టిఫికెట్ల పరిశీలనను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే రెవెన్యూ, హోమ్, జీఏడీ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సుమారు 30 ఏళ్ల పాటు సర్వీసులో ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఉన్నత భావన కలిగేలా కార్యక్రమం నిర్వహించాలని సీఎస్ సూచించారు. ఈ సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్ రాజ్, రిజ్వి, సందీప్ కుమార్ సుల్తానియా, లోకేష్ కుమార్, టీకే శ్రీదేవి, ఆర్.వి.కర్ణన్, ప్రియాంక, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






