హైదరాబాద్‌ - శ్రీశైలం మధ్య తగ్గనున్న దూరం

by Gantepaka Srikanth |

తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత లేదని చెప్పారు.

హైదరాబాద్‌ - శ్రీశైలం మధ్య తగ్గనున్న దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత లేదని చెప్పారు. ఫ్లైఓవర్స్‌, ఎక్స్‌ప్రెస్‌వేలు, రింగ్‌ రోడ్‌లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌-శ్రీశైలం(Hyderabad - Srisailam Highway) మధ్య దూరం తగ్గేలా ఎలివేటెడ్‌ కారిడార్‌పై కేంద్రం దృష్టి పెట్టిందని తెలిపారు. హైదరాబాద్‌-విజయవాడ హైవేను ఆరు లేన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో భూసేకరణ కాకపోవడంతో కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత రోడ్డ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల మీదుగా జాతీయ రహదారులు వెళ్లుతున్నట్లు తెలిపారు.

శనివారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా, ప్రస్తుతం అవి సుమారు 5200 కిలోమీటర్లకు పెరిగాయని అన్నారు. గత పదేళ్లలో రూ.1,25,485 కోట్లు జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నదన్నారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో మరిన్ని రోడ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు, మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమిపూజ చేసేందుకు ఈనెల 5వ తేదీన రానున్నట్లు తెలిపారు. సుమారు రూ. 5,416 కోట్లతో 167 కి.మీ. మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు.

Next Story