రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. కేంద్రంపై YS షర్మిల సీరియస్

by Disha Web Desk 2 |
రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. కేంద్రంపై YS షర్మిల సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని శనివారం ఆమె ఒక ప్రకటనలో ఖండించారు. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి నెల రోజుల సమయం ఉందని, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమన్నారు. రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు గొప్పవని, బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలపై అణచివేత తగదని, పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్నా.. రాసుకున్న రాజ్యాంగం అమలు కావాలన్నా.. ఇలాంటి నిరంకుశ నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు.


Next Story

Most Viewed