- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారీ బాటపై కన్ను! పేట్ బషీరాబాద్ సర్వే నం. 95 భూమిపై వివాదం
తనకు రిజిస్ట్రేషన్ ఉన్న భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ బాట స్థలంలో ఓ వ్యక్తి ని ర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో వివాదం తలెత్తి పోలీస్ కేసుల వరకు వెళ్లింది.

దిశ, పేట్ బషీరాబాద్: తనకు రిజిస్ట్రేషన్ ఉన్న భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ బాట స్థలంలో ఓ వ్యక్తి ని ర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో వివాదం తలెత్తి పోలీస్ కేసుల వరకు వెళ్లింది. అనంతరం పంచాయితీ ఓ లీడర్ వద్దకు చేర డంతో వివాదం సద్దుమణిగినప్పటికీ, తనది కాని సర్వే నంబర్‌లో ని ర్మాణాలకు యత్నిస్తున్నారనే ఆరోపణలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్ బషీరాబాద్ సర్వే నంబర్-95 లో జరుగుతున్న నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. ప్రైవేటు సర్వే నంబర్‌కు ఆనుకుని ఉన్న ప్ర భుత్వ బాటలో చేపడుతున్న నిర్మాణాలపై పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
బాటను కలిపేసుకుంటూ..
సదరు యజమాని తన సర్వే నంబర్ 95కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 93, 94-10, 11ల మధ్య ఉన్న ప్రభుత్వ బాటను కూడా తన స్థలం లో కలుపుకుని ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2018 నాటి రిజిస్ట్రేషన్ పత్రాలను ఆధారం గా చూపుతూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులకు ఇప్ప టికే ఫిర్యాదులు అందినట్లు సమా చారం. అధికారిక కాడస్ట్రల్, విలేజ్ మ్యాపుల్లో స్పష్టంగా ప్రభుత్వ దారి గా నమోదై ఉన్న స్థలంపై ప్రహరీ నిర్మాణానికి యత్నించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ వివాదం నియోజకవర్గంలోని ఓ కీలక నాయకుడి వద్దకు చేరడంతో తాత్కాలికంగా సద్దుమణిగినట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్థలంలో బొడ్రాయి కోసం కొంత భూమి వదిలి, మిగతా భూమితో పాటు ప్రభుత్వ బాటను కూడా వినియోగించుకునేలా ఒప్పందం జరిగిందనే ఆరోపణలున్నాయి.
ప్రస్తుతం ఈ భూమి ప్రైమ్ లొకేషన్ లో ఉండడంతో దీని విలువ కోట్లలో ఉంటుందని స్థానికులు చెబుతున్నా రు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గుర్తించాలని వారు డి మాండ్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో బైరెడ్డి రా జేష్ మాట్లాడు తూ, ఫిర్యాదులు, ఆరోపణలపై పరిశీలన జరిపి సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటాం అన్నారు.
'సమోసా బిట్'లోనే ఆరోపణలు..
పేట్ బషీరాబాద్ పరిధిలోని సర్వే నంబర్ 95/1/ఏలో సుమారు 588 చదరపు గజాల భూమి ఉందని చెబుతున్న ఓ వ్యక్తి, ఆ స్థలాన్ని తన సొంతమని పేర్కొంటూ కొద్ది రోజుల క్రితం నిర్మాణాలకు యత్నించడంతో వివాదం మొదలైంది. అయితే అక్కడ తమ గ్రామ దేవత ‘బొ డ్రాయి’ ఉందని, ఆ ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టరాదని గ్రామ స్తులు అభ్యంతరం వ్యక్తం చేశా రు. స్థానికుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడం తో వివాదం ముదిరింది. అనం తరం భూ యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ డంతో, తమ అనుమతి లేకుం డా స్థలంలోకి ప్రవేశించి బొడ్రా యి నిర్మాణానికి యత్నించారనే ఆరోపణలపై పలువురు గ్రామస్తులపై గతంలో క్రిమినల్ కేసు లు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ 'సమోసా బిట్'గా పిలిచే భూమి వ్యవహారంలో మరో కోణం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.






