Disha Effect: దిశ ఎఫెక్ట్.. మిస్ అయిన ఎస్ఐ గన్ కోసం సెర్చింగ్

by Prasad Jukanti |

నెల రోజులు గడుస్తున్న ఎస్ఐ గన్ మిస్సింగ్ కేసు తేలకపోవడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.

Disha Effect: దిశ ఎఫెక్ట్..  మిస్ అయిన ఎస్ఐ గన్ కోసం సెర్చింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మిస్టరీగా మారిన అంబర్‍పేట పోలిస్ స్టేషన్ లో మిస్ అయిన ఎస్ఐ గన్ వ్యవహారంలో కదలిక వచ్చింది. అంబర్ పేట ఎస్ఐ బాను ప్రకాశ్ రెడ్డికి సంబంధించిన సర్వీస్ గన్ మిస్ అయి దాదాపు నెల రోజులు అవుతున్నా దాని మిస్టరీ మాత్రం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో నిన్న దిశ 3 పీఎం డైనమిక్ ఎడిషన్ లో 'వీడని మిస్టరీ' శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయమే అంబర్‍పేట పీఎస్‍లో గన్ కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు. పీఎస్ వద్ద వాహనాలు పార్కింగ్, స్కాప్ యాడ్‍లో మనుషులను పెట్టించి వెతికిస్తున్నారు.

Next Story