- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: దీర్ఘకాలిక సమస్యలు.. ఎట్టకేలకు చర్చలు సఫలం
విద్యుత్ సిబ్బంది, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 1104 విద్యుత్ యూనియన్ పలుమార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు యాజమాన్యాల నుంచి స్పందన లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ సిబ్బంది, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 1104 విద్యుత్ యూనియన్ పలుమార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు యాజమాన్యాల నుంచి స్పందన లభించింది. మంగళవారం నాడు ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ 1104 యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం పట్ల ఇద్దరు సీఎండీలు సానుకూలంగా స్పందించారు. చర్చల సందర్భంగా హెచ్ఆర్డి డైరెక్టర్ శివాజీ, ఆపరేషన్స్ డైరెక్టర్ నర్సింహులు, సీజీఎం హెచ్ఆర్డి హెచ్ఆర్డీ భాస్కర్, ట్రాన్స్కో హెచ్ ఆర్డీ డైరెక్టర్ శ్రీనివాస్, 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అదనపు కార్యదర్శి వరప్రసాద్, సలహాదారు జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, డిస్కం అధ్యక్షుడు వేణు, భాస్కర్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ కంపెనీ రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.






