ఏపీ ప్రభుత్వం సమాచారం దాచి పెడుతోంది.. గోదావరి నదీ యాజమాన్య బోర్డులో కీలక చర్చలు

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు సమాచారం, వివరాలు దాచి పెడుతోందని తెలంగాణ నీటిపారుదల అధికారులు ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వం సమాచారం దాచి పెడుతోంది.. గోదావరి నదీ యాజమాన్య బోర్డులో కీలక చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP government) తలపెట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు సమాచారం, వివరాలు దాచి పెడుతోందని తెలంగాణ నీటిపారుదల అధికారులు ఆరోపించారు. గోదావరి -బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై (Godavari River Management Board) గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)లో కీలక సమావేశం జరిగింది. సోమవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదారబాద్‌లోని జలసౌధలో బోర్డు 17 వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

జీఆర్‌ఎంబీకి కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలవుతుందని, అయిన సమాచారం ఇవ్వలేదని తెలంగాణ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని మరోసారి తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్త చేశారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు, దీనివల్ల తెలంగాణపై ప్రభావం లాంటి తదితర అంశాల వివరాలు ఏపీ సర్కార్ అందించాలని అధికారులు బోర్డును కోరారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచర్ల ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రాలను అనుమతి తీసుకోకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలంగాణ అధికారులు ఆరోపించారు.

Next Story