మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్.. కేటాయించే శాఖలివే?

by Gantepaka Srikanth |

తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌(Azharuddin) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్.. కేటాయించే శాఖలివే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌(Azharuddin) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. అజారుద్దీన్‌కు ఇవ్వబోయే శాఖపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హోంశాఖ లేదా మైనార్టీ శాఖలు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు తెలంగాణ కేబినెట్‌లో ముస్లింలు లేరు. ఇదే విషయమై గతకొంతకాలంగా విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి. ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో కూడా అదే అంశాన్ని విపక్షాలు ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

కాగా, శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. మేనమామ జైనులాబుద్దీన్‌ స్ఫూర్తితో క్రికెట్‌ వైపు అడుగులు వేసిన అజార్.. 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేశారు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. జట్టులో అద్భుతంగా రాణించి తన ప్రతిభ చూపించారు.

Next Story