- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకం.. గ్లోబల్ సమ్మిట్‍లో మంత్రి అజారుద్దీన్
రేవంత్ రెడ్డి విజన్ 2047 నిజంగా అద్భుతం

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నుంచి అనేకమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారని మంత్రి అజారుద్దీన్ అన్నారు. గోపీచంద్ అకాడమీ నుంచి అనేక మంది వచ్చారని క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకం అన్నారు. ఫుట్ బాల్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ (Olympic Gold Quest) అంశంపై చర్చ నిర్వహించారు. దీనిలో మంత్రి అజారుద్దీన్‌తో పాటు క్రీడా ప్రముఖులు అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, అంబటి రాయుడు, గుత్తా జ్వాల పాల్గొన్నారు. ఈ చర్చలో మాట్లాడిన అజారుద్దీన్.. పీవీ సింధు, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల మంచి పేరు తెచ్చుకున్నారని క్రీడాకారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాపాలసీతో అనేక ఉపయోగాలు ఉన్నాయని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అండదండలు అవసరం అన్నారు. క్రీడాకారులకు ఆర్థిక సాయం, మంచి ఉద్యోగం ఇవ్వాలన్నారు.
ప్రతిదశలో ప్రోత్సాహం చాలా అవసరం: పీవీ సింధు
ఈ చర్చలో పీవీ సింధు మాట్లాడుతూ క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని పీవీ సింధు అన్నారు. మౌలిక వసతులు, కోచ్‌లు చాలా కీలకమని చెప్పారు. ప్రతి దశలోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని రాబోయే సంవత్సరాలు తెలంగాణ క్రీడాకారులకు ఎంతో ఆశాజనకంగా ఉండబోతున్నాయన్నారు.
విజన్ 2047 అద్భుతం:గోపీచంద్
పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ హైదరాబాద్ దేశంలోనే ఉత్తమ నగరాలలో ఒకటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 నిజంగా అద్భుతమైనదన్నారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రికి వ్యక్తిగత నిబద్ధత ఉందని స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్‌ల ప్రకటన నుంచి పిల్లల్లో ఫిట్‌నెస్, క్రీడల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహించే విషయాలు ఇందుకు నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత ఫిట్ సీఎంలలో ఒకరు అని ఆయన క్రమశిక్షణ, క్రీడల పట్ల ఉన్న ఉత్సాహం అందరికీ ప్రేరణనిస్తుందన్నారు. తెలంగాణ క్రీడల భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సమ్మిట్‌లో భాగస్వామిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.






