- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రా, తెలంగాణ పోలీసుల బదిలీలు చేపట్టాలి: కూనంనేని
పదోన్నతులు.. ఖాళీల లభ్యత ఆధారంగా ఉంటాయని, ఎప్పటికప్పుడు ఏర్పడిన ఖాళీలను అనుసరించి అర్హులైన పోలీస్ కానిస్టేబుల్‌లను హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతులు కల్పించడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పదోన్నతులు.. ఖాళీల లభ్యత ఆధారంగా ఉంటాయని, ఎప్పటికప్పుడు ఏర్పడిన ఖాళీలను అనుసరించి అర్హులైన పోలీస్ కానిస్టేబుల్‌లను హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతులు కల్పించడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనసభలో సభ్యులు మందుల సామేలు, సబితా ఇంద్రారెడ్డి, కూనంనేని సాంబశివరావు, కేఆర్.నాగరాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. జోనల్ వారీగా జరిగిన రిక్రూట్ మెంట్ ఆధారంగా ప్రమోషన్లను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఒకే బ్యాచ్‌కు చెందిన ఎస్ఐలకు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఉన్నవారికే ప్రమోషన్లు వచ్చాయని, వరంగల్, ఇతర జిల్లాల్లో మాత్రం ప్రమోషన్లు రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నారని సభ్యులు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హోంగార్డుల సమస్యలు సైతం పరిష్కరించాలని కోరారు. మంత్రుల జిల్లాల్లోని పోలీసులకు మాత్రమే సరెండర్ లీవ్స్ కు సంబంధించిన బిల్లులు చెల్లించారని పాయల్ శంకర్ తెలిపారు. పోలీసులకు సైతం ఈహెచ్ఎస్ కల్పించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.
ఆంధ్రా, తెలంగాణ పోలీసులు..
రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ పోలీసులు ఆంధ్రాలో, ఆంధ్రా పోలీసులు తెలంగాణలో పనిచేస్తున్నారని, ఇరు ప్రభుత్వాలు చర్చించుకుని బదిలీలు చేపట్టాలని సభ్యులు కూనంనేని సాంబశివరావులు సూచించారు. పోలీసులకు షిఫ్ట్ సిస్టం అమలు చేయాలని కోరారు. సరెండర్ లీవ్స్, డీఏ, టీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.






