- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలిలో ఆసక్తికర పరిణామం.. తారసపడిన కవిత, జీవన్ రెడ్డి
by GSrikanth |
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇవాళ శాసన మండలి సమావేశం ప్రారంభానికి ముందు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కూడా వీరి పక్కనే ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోగా ఇక్కడ గెలిచిన డా.సంజయ్ కుమార్ తరపున కవిత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటా మంతీ కలవడం పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తిగా మారింది.
Next Story






